ఏకపక్షంగా 'ఎమర్జెన్సీ' విధించిన ఇందిరా..

by Manoj |   ( Updated:2022-06-25 05:13:11.0  )
ఏకపక్షంగా ఎమర్జెన్సీ విధించిన ఇందిరా..
X

దిశ, ఫీచర్స్: భారతీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా 1975 జూన్ 25 అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)ని విధించింది. దీంతో 1975-77 మధ్యకాలంలోని 21నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా చెప్పుకుంటారు. భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన ఈ ఎమర్జెన్సీని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారు.

కాగా ఈ ఆర్డర్.. ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధాన మంత్రికి అందించింది. దీంతో ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేశారు ఇందిరా గాంధీ. అంతేకాదు ఆమె కొడుకు సంజయ్ గాంధీ ముందుండి నడిపిన మాస్-స్టెరిలైజేషన్ (సామూహిక గర్భనివారణ కార్యక్రమం) వంటి ఇతర దురాగతాలు కూడా నివేధితం అయ్యాయి. ఇక స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి. కాగా దీన్ని 1977 మార్చి 21న ఉపసంహరించుకున్నారు.


నేరేడు పళ్లను పురుషులు తప్పకుండా తినాలి.. ఎందుకంటే స్పెర్మ్...


ఐరన్ రిచ్ ఫ్రూట్స్, కూరగాయలతో బెనిఫిట్స్.


ఉదయం నిద్ర లేవగానే నీళ్లు ఎందుకు తాగాలి..?

Advertisement

Next Story

Most Viewed