- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే మూడు నెలల్లో పెరగనున్న నియామకాలు!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా నియామకాలు చేపట్టనున్నట్టు ఓ నివేదిక తెలిపింది. ఏకంగా 38 శాతం కంపెనీలు రాబోయే మూడు నెలల పాటు కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టం చేశాయి. ప్రముఖ మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయి్‌మెంట్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం గతేడాది కంటే ఎక్కువగా దాదాపు అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని 3,090 కంపెనీలు వెల్లడించాయి.
అయితే, త్రైమాసిక ప్రాతిపదికన మాత్రం 11 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్య ఉద్యోగులు పెరగనున్నారని 55 శాతం, స్థిరంగా ఉండనున్నట్లు 36 శాతం, తగ్గొచ్చని 17 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. దీంతో సగటున 38 శాతం కంపెనీలు కొత్త నియామకాలను ఆసక్తిగా ఉన్నట్లు తేలింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత అంతర్జాతీయంగా రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటి చెప్పారు.
అయినా సరే భారత్‌లో ఐటీ, టెక్నాలజీ రంగాల మద్దతు బలంగా ఉందని, స్టార్టప్‌లకు భారత్ అత్యంత అనుకూల దేశంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధిలో మహిళలకు సంబంధించి కొంత ఆందోళనకరంగా ఉందని నివేదిక తెలిపింది. ఇక, మొత్తం ఉపాధిలో ఐటీ, టెక్నాలజీ రంగాలు ముందుంటాయని, వీటి తర్వాత రెస్టారెంట్లు-హోటళ్లు, విద్య, వైద్య, సామాజిక-ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పెరగనున్నాయని నివేదిక వెల్లడించింది.