భారత్‌లో మళ్లీ అంతర్జాతీయ విమానాలు.. రెండేళ్ల తర్వాత

by Javid Pasha |
భారత్‌లో మళ్లీ అంతర్జాతీయ విమానాలు.. రెండేళ్ల తర్వాత
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తన అంతర్జాతీయ విమానాలను నిషేధించింది. మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపు రెండేళ్లుగా ఆగి ఉన్న అంతర్జాతీయ విమానాలను భారత ప్రభుత్వం ఆదివారం తిరిగి ప్రారంభించింది. అయితే డీజీసీఏ చెప్పిన దాని ప్రకారం.. 40 దేశాల నుంచి దాదాపు 60 ఎయిర్ లైన్స్‌‌కు సంబంధించిన 1,783 ఫ్రీక్వెన్సీల్లో భారత్ నుంచి, భారత్‌కు విమాన రాకపోకలు జరగనున్నాయి. అంతేకాకుండా ఎయిర్ లైన్స్ క్రూ మెంబర్స్ ఇకపై పీపీఈ కిట్స్ ధరించాల్సిన అవసరం లేదని, దాంతో పాటుగా పూర్తి 100 సామర్థ్యంతో విమానాశ్రయాలు పనిచేస్తాయని చెప్పారు.

Advertisement

Next Story