- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎఫ్ఐహెచ్‌లో ఇండియా టాప్.. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్
భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కేంద్రంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ హకీ మెన్స్ వర్డ్ ప్రోలీగ్ (ఎఫ్ఐహెచ్)లో టీమిండియా హాకీ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. 2024లో నిర్వహించే పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచులను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నిర్వహిస్తోంది. అయితే, ఈ టోర్నీలో భారత హకీ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. శనివారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును ఓడించిన భారత్.. ఆదివారం భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును 4-3 తేడాతో మరోసారి ఓడించింది. ఇండియన్ డిఫెండర్ హర్మన్ ప్రీత్ సింగ్ వరుసగా హ్యాట్రిక్ గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎఫ్‌ఐహెచ్ ప్రోలీగ్‌లో టీమిండియా హాకీ జట్టు ఇప్పటికే 10 మ్యాచులు గెలిచి 21 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తర్వాత జర్మనీ రెండో స్థానం, నెదర్లాండ్స్ మూడు, అర్జెంటైనా నాలుగు, బెల్జియం ఐదో స్థానంలో నిలిచాయి.