- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కట్టుబడే ఉన్నాం: వన్ ఓషన్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ సముద్ర నాగరికతలో ఫ్రాన్స్ చొరవకు మద్దతును కొనసాగిస్తుందని తెలిపారు. వన్ ఓషన్ సమ్మిట్‌లో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా మాట్లాడారు. దేశాల భద్రత, శ్రేయస్సు సముద్రాలతో ముడిపడి ఉన్నాయని ఉద్ఘాటించారు. నీటి అడుగున ప్లాస్టిక్ కాలుష్యం పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని, చట్టబద్ధంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఇతర దేశాల నాయకులను కోరారు. 'జాతీయ అధికార పరిధిని దాటి జీవవైవిధ్యంపై ఉన్నత ఆశయంతో ఫ్రాన్స్ చొరవకు భారత్ మద్దతు ఇస్తుంది. ఈ సంవత్సరం చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం కోసం మేము ఆశిస్తున్నాము' అని తెలిపారు. భారత్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఈ మధ్యనే దేశంలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో 3లక్షల మంది 13 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారని చెప్పారు. 100 భారత నేవీ ఓడలు సముద్రంలోని ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఫ్రాన్స్ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.