- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మురికివాడ పిల్లలకు విద్యనందిస్తున్న 'ప్రాజెక్ట్ పాఠశాల'
దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం పిల్లలు చదువుకునేందుకు, వారిలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం, స్కాలర్‌షిప్స్, ప్రైవేట్ స్కూల్‌లో నిరుపేదలకు రిజర్వేషన్స్ కూడా అందిస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా సరే స్కూల్‌కు హాజరుకాని నిరుపేద పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మురికివాడల్లో పిల్లలకు చదువు చెబుతూ, పేద విద్యార్థులను బడి బాట పట్టిస్తోంది 'ప్రాజెక్ట్ పా8శాల'.
భారతదేశంలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మిలియన్ల మంది పిల్లలు ఎప్పుడూ విద్యా సంస్థలకు హాజరు కాలేదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) నివేదిక వెల్లడిస్తుంది. ఇక 5 నుంచి 9 ఏళ్ల వయస్సు గల బాలికల్లో దాదాపు 53 శాతం మంది చదువుకోవడం లేదని, 47 శాతం మంది మాత్రమే పాఠశాలకు వెళ్తున్నారని స్మైల్ ఫౌండేషన్ నివేదించింది. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలకు రాజ్యాంగం ద్వారా విద్యా హక్కు హామీ ఉన్నందున.. భారత ప్రభుత్వం కూడా నిరుపేద పిల్లలందరికీ విద్యను అందించడానికి క్రమం తప్పకుండా ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ప్రయోజనం లేకుండా పోవడంతో.. ఈ సమస్యను పరిష్కరించే విధంగా 2016లో 'పరివర్తన్ ద చేంజ్' అనే గ్రూప్ ఆధ్వర్యంలో టైర్-2 సిటీ మొరాదాబాద్‌లోని మురికివాడలో ప్రాజెక్ట్ 'పా8శాల' ప్రారంభమైంది. కేవలం 25 మంది మురికివాడల పిల్లలతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన యువకుల బృందం ఇప్పటివరకు 700 మందికి పైగా పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్నారు. ఇది కేవలం ఉచిత విద్యను అందించేందుకు మాత్రమే పరిమితం కాకుండా మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి ఆ వ్యసనాల బారిన పడకుండా చూసుకుంటోంది. అంతేకాదు విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు.. వారికి నచ్చిన జీవితాన్ని అందించేందుకు మార్గనిర్దేశం కూడా చేస్తోంది.
జీవితంలో విద్య వల్ల కలిగే ప్రయోజనాలు, ఆవశ్యకతను పిల్లలకు వివరించాలి. పరివర్తన్‌లో మేము వారికి ఉత్తమమైన మార్గంలో బోధిస్తాం. యువత విద్యావంతులైనప్పుడే సమాజం దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని మా టీం నమ్ముతుంది. మొరాదాబాద్, డెహ్రాడూన్, ఢిల్లీ-NCR, రాంపూర్, కాశీపూర్ వరకు మా ప్రాజెక్ట్స్ విస్తరించాం.
మొరాదాబాద్‌లోని రెంటెడ్ స్పేస్‌లో పా8శాల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించాం. దీని కింద, పేద పిల్లలు కొత్త విద్యా విధానం (NEP) 2020 ప్రకారం చదువుతున్నారు. ఇక్కడి పిల్లలు రక్తదాన శిబిరాలు, వ్యర్థాల నిర్వహణ, శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ, అవసరమైన వారికి భోజన-కిట్ పంపిణీలో కూడా సాయం చేస్తారు.
- కపిల్ కుమార్, వ్యవస్థాపకుడు