- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు గజాల స్థలం కోసం ఒకరినొకరు ఏం చేసుకున్నారంటే..?
దిశ, భిక్కనూరు : రెండు గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తి రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు దిగిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శనివారం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోళ్ళ చిన్నమల్లయ్యకు ఉన్న మూడు గుంటల భూమిలో.. రెండు గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు భూమయ్య, బాలమల్లు, యాదిరెడ్డిలు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు. తన భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నావంటూ ఇరు కుటుంబాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది.
దీంతో కబ్జా చేసేందుకు యత్నించిన వారిలో ఒకరు రాళ్లతో దాడి చేయగా.. పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లతో కొట్టుకుంటూనే గల్లాలు చించుకొని రక్తాలు కారేటట్టు కొట్టుకున్నారు.పక్కనే ఉన్న కట్టెల కుప్ప వద్దకు వెళ్లి.. ఆ కుప్పలోని కర్రలను తీసుకొని పరస్పర దాడులకు దిగారు. దాడులకు దిగుతున్న వారిని అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోగా.. వారు కూడా గాయపడ్డారు. ఒక్కసారిగా ఘర్షణ స్థలంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ దాడిలో భూ యజమాని కర్రోళ్ళ చిన్న మల్లయ్య, ఆయన కుమారుడు రవి, భార్య భూమవ్వ, కుమార్తె రేణుకలు తీవ్రంగా గాయపడి.. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి దిగిన వారు పోలీస్ స్టేషన్ కు చేరుకొని తమపై దాడి చేసి, రక్తాలు కారేటట్టు కొట్టారని.. తమను హాస్పటల్‌కు పంపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని, వారి నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.