వెనక్కి తిరుగుతున్న గడియారాలు.. ట్రైబల్ ఏరియాలో వింత ఆచారం

by Manoj |
వెనక్కి తిరుగుతున్న గడియారాలు.. ట్రైబల్ ఏరియాలో వింత ఆచారం
X

దిశ, ఫీచర్స్ : కాలాన్ని వెనక్కి తిప్పడమంటే సినిమాలు లేదా ఫాంటసీల్లోనే సాధ్యం. అయితే ఈ భావన ఆసక్తి కలిగిస్తున్నా రియల్ లైఫ్‌లో మాత్రం అసాధ్యమే. కానీ భారతదేశంలోని ఓ గిరిజన సంఘం అనుసరిస్తున్న ఆచారానికి దీనితో దగ్గరి పోలికలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ కమ్యూనిటీ కోసం సమయం వెనక్కి నడుస్తోంది. వినేందుకు వింతగా ఉన్నా.. ఇదే నిజం. ఈ గ్రామాల్లోని అన్ని గడియారాలు యాంటీ క్లాక్‌వైజ్‌లో నడుస్తాయి. సాధారణంగా ఏ గడియారమైనా 12 PM తర్వాత 1 PM చూపిస్తుంది. కానీ ఇక్కడి గడియారాలు మాత్రం 11 AM చూపిస్తుండటం విశేషం.

ఈ ఆచారాన్ని అనుసరిస్తున్న గోండు గిరిజన సంఘం కోర్బా జిల్లాలోని ఆదివాసీ శక్తి పీఠంతో అనుబంధం కలిగి ఉంది. ప్రకృతి నియమాలను అనుసరిస్తున్నందున తమ గడియారం అత్యంత సహజమైనదిగా వాళ్లు నమ్ముతుంటారు. భూమి కుడి నుండి ఎడమకు అంటే అపసవ్య(యాంటీ క్లాక్‌వైజ్) దిశలో కదులుతుందని, చంద్రుడు భూగ్రహం చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతున్నాడనేది వారి విశ్వాసం. అందుకే ఈ కమ్యూనిటీ పెళ్లి వేడుకల్లో నూతన వధూవరులు కూడా అపసవ్య దిశలోనే ఏడడుగులు వేస్తారు.

ఈ గోండ్ కమ్యూనిటీతో పాటు 29 ఇతర సంఘాల ప్రజలు గోండ్వానా గడియారాన్ని అనుసరిస్తారు. గిరిజన సమాజానికి చెందిన ఈ ప్రజలు మహువా, పర్సా, తదితర చెట్లను పూజిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ప్రాంతంలో సుమారు పది వేల కుటుంబాలు నివసిస్తుండగా.. అందరూ రివర్స్ క్లాక్ ఫార్ములానే అనుసరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed