- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్ పాలిక్స్‌లోకి అమెరికా.. తేల్చి చెప్పిన ఇమ్రాన్
దిశ వెబ్‌డెస్క్: ప్రస్తుతం పాకిస్తాన్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పాకిస్తార్ ఆర్మీ vs ఇమ్రాన్ ఖాన్ హ్యాష్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇమ్రాన్‌ను ప్రధాని గద్దె దించేందుకు సొంత పార్టీ సభ్యులు సహా ఆర్మీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అతడి పాలన సరిగా లేదంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాంతో పాటుగా రాజకీయ నాయకులు అవిశ్వాస తీర్మానం చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్ ఏర్పడుతున్న పొలిటికల్ క్రైసిస్‌కి యూఎస్ కారణమంటూ అమెరికా ఆరోపించడం ప్రారంభించాడు.
తనను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు యూఎస్ ఈ పన్నాగం పన్నిందంటూ నిర్మొహమాటంగా ఆరోపణలు గుప్పించారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చి యూఎస్ కుట్రలో భాగమేనని, తన దేశ రాజకీయాల్లో యూఎస్ కావాలనే తలదూరుస్తుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే అవిశ్వాస తీర్మానానికి ముందుకు రోజు ఇమ్రాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎటూ దారిలేక ఇమ్రాన్ తన చేతకాని తనాన్ని అమెరికా నెత్తిన రుద్దుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు.