అభివృద్ధి పనులు చేసే ఉగ్రవాదిని: సీఎం కేజ్రీవాల్

by Web Desk |
అభివృద్ధి పనులు చేసే ఉగ్రవాదిని: సీఎం కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఛీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనపై వస్తున్న ఆరోపణలకు బదులిచ్చారు. తాను అభివృద్ధి పనులు చేసే ఉగ్రవాదినని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ నుద్దేశించి కేజ్రీవాల్ ను వేర్పాటువాదులకు మద్ధతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కేజ్రీవాల్ శుక్రవారం మీడియాతో వర్చువల్ సమావేశంలో వివరణ ఇచ్చారు.

ఆయన స్పందిస్తూ 'వారంతా నా చుట్టూ చేరి నన్ను ఉగ్రవాదిగా పేర్కొంటున్నారు. ఇది హాస్యాస్పద విషయం. ఒకవేళ అదే నిజమైతే ప్రధాని మోదీ నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను ప్రపంచంలోనే తియ్యటి ఉగ్రవాదిని కావచ్చు. ఎందుకంటే ఓ ఉగ్రవాదిగా స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు, జల సదుపాయం కల్పించాను' అని అన్నారు. అన్ని పార్టీలు తమకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.

కేజ్రీవాల్ దేశాన్ని విభజించాలని కుట్ర పన్నుతున్నారని, తానే ఒక భాగానికి ప్రధానిని అవుతానని అంటున్నారని చెప్పారు. 'దీనర్థం నేనో పెద్ద ఉగ్రవాదిని. అయితే భద్రతా దళాలు ఏం చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద పార్టీలు దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నాయి' అని అన్నారు. దేశంలో రెండు రకాలు ఉగ్రవాదులున్నారని అన్నారు.

కొందరు ప్రజల్లో భయం వ్యాప్తి చేసేవారని, మరికొందరు అవనీతిపరులలో భయాన్ని కలిగిస్తోందని అన్నారు. అవినీతి నేతలు తనకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారన్నారు. '100 ఏళ్ల క్రితం కొందరు భగత్ సింగ్‌ను ఉగ్రవాది అని అన్నారు. ఇప్పుడు ఆయన అనుచరుడిని కూడా ఉగ్రవాదిగా వర్ణిస్తున్నారు' అని చెప్పారు. వేర్పాటు వాదం పై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

Advertisement

Next Story