నేను క్రిస్టియానోలా నిద్రలేస్తే ఫస్ట్ అదే చేస్తా: Kohli

by Manoj |   ( Updated:2022-04-05 05:48:21.0  )
నేను క్రిస్టియానోలా నిద్రలేస్తే ఫస్ట్ అదే చేస్తా: Kohli
X

దిశ, వెడ్ డెస్క్: ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానోకు ఉన్న ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత క్రికెటర్ కింగ్ కోహ్లీ సైతం క్రిస్టియానో అభిమానుల్లో ఒకడు. అయితే తాజాగా కోహ్లీకి ఓ వింత ప్రశ్న ఎదురైంది. ఏదో ఒకరోజు మీరు క్రిస్టియానో రొనాల్డోలా నిద్రలేస్తే మీరు ఏం చేస్తారు అని కోహ్లీని అడిగారు. దానికి కోహ్లీ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. అదే జరిగితే తాను మొదట ఆ పని చేస్తానంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. 'నేను ముందుగా నా మెదడును స్కాన్ చేస్తాను. అంత మెంటల్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల క్రిస్టియానో గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నవారిలో అతడే కంప్లీట్ ప్లేయర్ అంటూ కోహ్లీ కొనియాడాడు.


Advertisement

Next Story