- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా గురించి నాకు తెలుసు.. వారి మాటలకు ఎందుకు బాధపడాలి.. విడాలకుపై స్టార్ హీరో సంచలన కామెంట్స్
దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో సెలెబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వచ్చి విడాకుల బాట పడుతున్నారు. పెళ్లైన కొన్నేళ్లకే విభేదాలతో విడాకులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే.. మ్యారేజ్ తర్వాత చాలా సంవత్సరాలు కలిసి ఉండి పిల్లలు పుట్టాక డివోర్స్ తీసుకునే వాళ్ళు మరికొంత మంది. అలా పెళ్లైనా 15 ఏళ్లకు భార్యతో విడాకులు తీసుకున్న వారిలో కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య ఆర్తి.. తన అంగీకారం లేకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశాడంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ చేసింది. దీంతో జయం రవిని చాలా మంది తప్పుపట్టారు. అయితే దీనిపై రవి రీసెంట్‌గా స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయం రవి విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “ఆర్తి వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదు. నేను నా ఇరు కుటుంబాల పెద్దలతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నాకు గాయనితో ఉన్న అనైతిక సంబంధాల గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. మనం పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే ప్రజలు గమనిస్తారు వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు, అది సహజమే. అలాగే సమాజంలో కొందరు వ్యక్తులు సినిమా నటుల వ్యక్తిగత జీవితంపై అనవసరమైన చర్చలు చేసే అలవాటు చేసుకున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
వృత్తికి నేను న్యాయం చేయాలంటే ఎలాంటి సందేహాలు లేకుండా ఉండాలి. నా వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని వదంతులు వ్యాప్తి చెందడం సహజం. అయితే కొందరు పరిణతి చెందిన వారు వాటిని ఆపుతారు. కానీ, మరికొందరు ఏమీ తెలియకుండానే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. అయినా నా గురించి నాకు బాగా తెలుసు. అందువల్ల ఇతరుల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు” అంటూ జయం రవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.