- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక అనవసరంగా హారన్ కొట్టినా నేరమే.. వాహనదారులకు బిగ్ వార్నింగ్..
దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్లపై ఇష్టారీతిన హారన్‌లను మోగిస్తూ వాహనదారులను ఇబ్బందిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద ఎక్కువ శబ్ధం చేస్తూ, రకారకాల హారన్‌లను వాడుతూ ప్రజలను, పాదచారులను ఇబ్బంది పెడుతూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. హారన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. జర్మనీ నుంచి ప్రత్యేక సాంకేతికతను తీసుకువచ్చి.. ఏ వాహనం ఎంత శబ్ధం చేసిందో తెలుసుకోనున్నారు. ముందుగా కూడళ్లలో, పలు రద్దీ ప్రదేశాల్లో సెన్సర్లను వినియోగించి ప్రతి వాహనం నుంచి వస్తున్న శబ్ధాన్ని రికార్డు చేయనున్నారు.
ఈ సాంకేతికతతో పరిమిత శబ్ధం కంటే మించిన సౌండ్ చేసిన వాహనాన్ని ఫొటో తీసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది. అక్కడి నుంచి సంబంధిత వాహనదారులకు ఈ-చలాన్లు వెళ్లనున్నాయి. అంతేకాకుండా, హారన్‌లతో పాటు బస్సులు, ఆటోల ద్వారా వస్తున్న శబ్ధ కాలుష్యం, సైలెన్సర్ తీసేసి వాహనం నడపడం వంటివాటిపై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ డీజీపీ మహేందర్ దృష్టికి తీసుకెళ్లగా.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హారన్‌ల మోతను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముందుగా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం వీటిని నెలరోజుల పాటు వాహనదారులకు అవగాహన కల్పించి, అనవసరంగా హారన్‌మోత మోగించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.