- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుట్ బాల్ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న హైదరాబాద్
దిశ, మియాపూర్: ఐఎస్ఎల్ ట్రోఫీతో దేశ వ్యాప్త ఫుట్ బాల్ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న జట్టుగా హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ నిలిచిందని ఫ్రాంచైజ్ సహా యజమాని అరుణ్ త్రిపురనేని అన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ 2021-22 ఛాంపియన్‌గా అవతరించిన జట్టుగా హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ మంగళవారం జూబ్లిహిల్స్ లోని ఓ హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
గోవాలోని మార్గోవ్‌లో గల పీజేఎన్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి హీరో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టైటిల్‌ను హైదరాబాద్ ఎఫ్‌సీ ఉత్కంఠ భరిత పెనాల్టీ షూటౌట్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించిన విషయం విధితమే. హైదరాబాద్ ఎఫ్‌సీ చారిత్రక విజయంతోపాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నది. ఈ సీజన్‌లో 18 గోల్స్‌తో.. బార్తోలోమ్యగో జేస్ గోల్డెన్ బూట్‌ను గెలుచుకున్నాడు.
ఐఎస్ ఎల్ యొక్క ఆల్-టైమ్ టాప్ గోల్‌స్కోరర్‌గా 47 గోల్స్‌తో ఈ సీజన్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గోల్ కీపర్‌లలో లక్ష్మీకాంత్ కట్టిమణి అత్యధికంగా (61) సేవ్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మనోలో మార్క్వెజ్, ప్రధాన కోచ్ మాట్లడుతూ..ఈ సంవత్సరం తొలి టైటిల్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. జట్టు యొక్క సమిష్టి కృషి, సిబ్బంది, మేనేజ్‌మెంట్ నుండి మద్దతు, క్రమశిక్షణ కారణంగా సాధ్యమైందన్నారు.
అరుణ్ త్రిపురనేని, సహా యజమాని మాట్లాడుతూ.. ట్రోఫీ సాధించినందుకు సహా యజమానిగా చాలా సంతోషిస్తున్నామన్నారు. ఈ ట్రోఫీతో హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుందన్నారు. భారతదేశంలో ఫుట్‌బాల్ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయమన్నారు. ఇది జట్టు విజయం మాత్రమే కాదు.. హైదరాబాద్ నగరం సాధించిన విజయంగా అభివర్ణించారు.
భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ సాధన కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌బాల్ క్రీడల వృద్ధికి కృషి, ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో లక్ష్మీకాంత్ కట్టిమణి, జోవో విక్టర్, మనోలో మార్క్వెజ్, బార్ట్ ఓగ్బెచే, నిఖిల్ పూజారి తదితరులు పాల్గొన్నారు.