రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. తొందరలోనే ముహూర్తం

by Harish |
రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. తొందరలోనే ముహూర్తం
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌, సబా ఆజాద్‌ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రూమర్స్‌కు బలం చేకూర్చేలా హృతిక్‌ ఫ్యామిలీతో కలిసి సబా లంచ్‌ చేయడం, ఇతరత్ర ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హృతిక్, సబా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 2014లో సుస్సన్నే ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్న హృతిక్‌ను ఒంటిరిగా చూడలేక వీలైనంత త్వరగా మరో పెళ్లి చేసేందుకు ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సబా కూడా హృతిక్ ఫ్యామిలీకి బాగా నచ్చిందని, ఈ మధ్యకాలంలో వీలైనపుడల్లా హృతిక్‌ కుటుంబసభ్యులు సబాను ఇంటికి పిలుస్తూ మర్యాదలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed