వృషభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Satheesh |   ( Updated:2022-04-01 17:12:24.0  )
వృషభరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

కృత్తిక 2,3,4(ఈ, ఊ, ఏ); రోహిణి 1,2,3,4(ఓ, వా, కీ, వూ); మృగశిర 1, 2 (వే, వో)

ఆదాయం-8

వ్యయం-8

రాజపూజ్యం-6

అవమానం-6

ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 13.04.2022 వరకు 10వ స్థానంలో సువర్ణమూర్తిగాను తదుపరి 11వ స్థానంలో లోహమూర్తిగాను సంచరించును. శని సంవత్సరాది నుండి 29.04.2022 వరకు రజతమూర్తిగా 9వ స్థానంలో తదుపరి 10వ స్థానంలో సువర్ణమూర్తిగా 12.07.2022 వరకు ఉండును. తదుపరి 9వ స్థానంలో లోహమూర్తిగాను 17.01.2023 వరకు ఉండును. 10వ స్థానంలో తామ్రమూర్తిగాను ఉండును. రాహు-కేతువులు 1-7 స్థానములో తామ్రమూర్తులుగా 12.04.2022 వరకు ఉండును. తదుపరి 12-6 స్థానములో లోహమూర్తులుగాను సంచరించును. ఈ రాశివారికి మిశ్రమ ఫలితములు కనపడుచున్నవి. గత చాలాకాలముగా అనుభవించుచున్న మానసిక సంఘర్షణ తగ్గి జీవితమునకు ఒక సరియైన దశా, దిశా ఏర్పడు అవకాశము గలదు. నిరాశ దరిరానీయకండి. ప్రయత్నములు కొద్దిగా ఎక్కువగా చేయాలి. విజయము మీ దరి చేరగలదు. భవిష్యత్తుపై అనేక ఆలోచేనలు ఏర్పడవచ్చును. కానీ కార్యాచరణ ఒకింత ఆలస్యము. పేరు-ప్రతిష్టలు సంపాధిస్తారు. ఎక్కువమంది మీ సలహాలు-మీ స్నేహము ఆశిస్తారు. అందుకు తాపత్రయపడతారు. కళా, వ్యాసంగములో ఊహించని మార్పులు, ఆసక్తి, ప్రావీన్యత, కీర్తి, గౌరవం పెరుగుతాయి. ఒకానొక విశేష సన్మానమునకు మీరు ఎన్నికవుతారు. స్థిర-చర ఆస్తుల విషయంలో అతి నిర్లక్ష్యము పనికిరాదు. ఆస్తులు అమ్మి, నూతన ఆస్తులకై ఆరాటపడుతారు. మీరు నిల్చున్న స్థలాన్ని ప్రదేశమును బలముగా చేయుటకు ప్రయత్నించండి. అంతేకానీ దూరపు కొండలు నునుపు అని భ్రమించకూడదు. ఎండమావులలో నీరు ఉండదు కదా! మీ పరపతిని భంగపరిచే ప్రయత్నాలు జరిగినా సమర్థవంతముగా ఎదురుకొని, ఎత్తుకు పై ఎత్తులు వేసి మీ స్థాయి, స్థానాన్ని పదిలపరుచుకుంటారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చుననే సలహాలు స్వీకరించకండి. అనవసర వివాదాలకు దూరముగా ఉండాలి. ఉచిత సలహాలు ఇవ్వకండి. ఉద్యోగములో మీరు చేయు శ్రమకు గుర్తింపు ఉన్నా అసూయాపరులు సమయానికై వేచి చూస్తున్నారని తెలుసుకోవాలి. విలువైన వస్తువులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

మీ పై అధికారుల ఒత్తిడి పెరుగవచ్చును. ప్రతి చిన్న విషయానికి చిరారకు ఏర్పడవచ్చును. కోపము త్గగించుకోవాలి. పెద్దల ద్వారా సంక్రమించిన ఆస్తులు వివాదము కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మానసిక వాంఛ విషయయులో కొంత అసంతృప్తి ఏర్పడిననూ సర్దుకుపోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయములో అశ్రద్ధ పనికిరాదు. శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయినట్లయితే వైద్యుడిని సంప్రదించడంలో నిర్లక్ష్యము వహించకూడదు. ప్రతి చిన్న పనికి తొందరగా అలసిపోవడం జరుగవచ్చును. కానీ ఏది ఏమైనా గత 2 సంవత్సరములుగా ఉన్న మానసిక, శారీరక శ్రమ వత్తిడికి చాలా వరకు ఉపశమనము లభించి జీవితము అభివృద్ధి పథంలో నడుచును. భవిష్యత్తుకు కావలసిన చక్కని ఆలోచనలు, వాటికి కార్యాచరణ అమలు చేస్తారు. కాస్త తాత్కాలిక మానసిక స్థైర్యము తగ్గిననూ తిరిగి మీ సమయస్ఫూర్తి, ఆత్మస్థైర్యముతో సమాజంలో నిలదొక్కుకుంటారు. మీ స్థాయి పదిల పరుచుకుంటారు. సంవత్సరాంతములో ఆరోగ్య సమస్యలు ఉపశమిస్తాయి. అనేక మార్గాల ద్వారా మీరు చేస్తున్న కృషికి చక్కని ఫలితాలు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా అర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. జీవితములో ఆశించిన మార్పులు ఏర్పడవచ్చును. ఆరోగ్య సమస్యలు ఉపశమించి స్వస్థత చేకూరును. ఒక స్నేహితుడికి మీరు విశేష సహాయము చేయవలసిన పరిస్థితి రావచ్చును. ప్రభుత్వ ఉద్యోగులకుగాని, ప్రభుత్వరంగంలో ఉన్నవారికి గాని, రాజకీయ నాయకులకు గాని వారి వారి స్థాయికి ఉన్నత గౌరవము లభించు అవకాశము గలదు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడును.

తాత-ముత్తాతల ఆస్తికి సంబంధించి ఫలితాలు మీకు అనుకూలముగా ఉంటాయి. తండ్రిగారి పరిపూర్ణ సహాయ సహకారాల ద్వారా భవిష్యత్‌కు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. సంస్కృతి, సంప్రదాయపరమైన ఆసక్తి పెరిగి నిత్యం దైవధ్యానము దిశగా మోదటి అడుగు వేస్తారు, ఆచరిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని, గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది. ద్వితీయ సంతానం ఆరోగ్య విషయంలోగాని, విద్యా విషయంలోగాని స్వల్పమైన చికాకు ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయంతో బాటు అదనపు బాధ్యత కూడా నిర్వహించవలసివస్తుంది. ధనము మాత్రం అంచానాలకు మించి ఖర్చు అయ్యే అవకాశములు గలవు. నూతన వ్యాపారములలో ప్రవేశించుట. అనూహ్యంగా ధనము చేతికందుతుంది. గతంలో రుణంగా ఇచ్చిన ధనం మిశ్రమ ఫలంగా చేతికందుతుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం గలదు. మీ స్నేహాన్ని మీ ఆశ్రయాన్ని కోరే అవసరం మీ ప్రత్యర్థులకు వస్తుంది. ఈ రాశివారికి ఈ సంవత్సరము ఆదాయ సంబంధిత విషయాలలో అనుకూలంగా ఉండవచ్చు.

వీరి జాతకంలో గురుగ్రహ బలం అన్ని కార్యక్రమాల్లోనూ శుభ ఫలితములు సూచిస్తుంది. శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన గృహ సంబంధమైన శుభకార్యాలు, వాహనాలు కొనుగోలు చేయడం, విద్యా సంబంధిత విషయాల్లో ధనం ఎక్కువగా ఖర్చు చేయడం జరగవచ్చును. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల ఇతరులకు మేలు జరగడం, వృత్తి పరమైన ఉద్యోగపరమైన విషయాలలో శుభఫలితాల సూచన కనిపిస్తుంది. కళారంగాలలో ఉన్నవారికి ప్రత్యక్ష్య లేదా పరోక్ష లాభాలు చేకూరుతాయి. మేధస్సుకు తగిన గుర్తింపు లభించవచ్చును. వివాహ సంబంధాలలో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉండే సూచనలున్నాయి. విదేశీ ప్రయాణాలలో కాలం అనకూలతను సూచిస్తుంది. రుణ బాధల నుంచి ఉపశమనం, అప్పులను తీరచే అవకాశాలున్నాయి. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తేల్చుకోలేని అయోమయ స్థితి ఏర్పడవచ్చును. ఆరోగ్య సంబంధిత విషయాలలో జాగ్రత్తలు వహించడం శ్రేయస్కరం. ఏ విషయంలోనైనా నిర్లక్ష్యధోరణి లేకుండా ఉండే మంచిది. మీ యొక్క శక్తి మేరకు ఇతరులకు సహాయం అవకాశం ఉంది. రాజకీయాలలో ఉన్నవారికి శుభ ఫలితాలు, శత్రు వర్గాలపై ఆధిపత్యం పై చేయి అయ్యే అవకాశం ఉండే సూచన కనబడుతుంది.

Advertisement

Next Story