తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారు ఆభరణాలు అపహరణ

by Vinod kumar |   ( Updated:2022-03-06 17:27:37.0  )
తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారు ఆభరణాలు అపహరణ
X

దిశ, హత్నూర: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లంకి వీరేశం, భార్య రజిత లు నారాయణఖేడ్ లో ఉండే తమ కూతురు ఇంటికి 2 రోజుల ఉండి వద్దామని వెళ్లి.. వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో దాచుకున్న మూడు తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Advertisement

Next Story