- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తేనె విత్ బాదం.. ఈ సమస్య దూరం..?

దిశ, వెబ్‌డెస్క్: తేనె (honey) ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. తేనె లో విటమిన్లు (Vitamins), ఖనిజాలు (Minerals), పోషకాలు (Nutrients) దట్టంగా ఉంటాయి. తేనె తీసుకోవడం వల్ల (Immunity) పెరుగుతుంది, రక్త హీనత (anemia), మలబద్ధకం (Constipation), అజీర్తి (indigestion) వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. తేనెను గోరువెచ్చని నీటితో కలిపి త్రాగడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి (Sugar level) నియంత్రణ మెరుగుపడుతుంది.
రక్తానికి తేనె ఎంతో మేలు చేసే తేనె తీసుకోవడం వల్ల జీవక్రియ (Metabolism) పని తీరు బాగుంటుంది. తేనె ఒక యాంటి బాక్టీరియా (Anti bacteria), యాంటిసెప్టిక్ ఔషధం (Antiseptic medicine). తేనె ఒక శక్తివంతమైన ఆహారం. చర్మ, తలపై మాడుకు సోకే రోగాలకు తేనెతో నియంత్రించవచ్చని నిపుణులు చెబుతుంటారు. తేనె పిల్లలకు ఇచ్చే.. పిల్లలు ఉపశమనం పొంది బాగా నిద్ర పోవటానికి మేలు చేస్తుంది.
ఇక బాదం హెల్త్ బెనిఫిట్స్ చూసిటనట్లైతే.. బాదంపప్పుల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులు తినడం వల్ల హార్ట్ ఆరోగ్యం, వెయిట్ అదుపులో ఉండటం, రక్తంలో చక్కెర నియంత్రణ, మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు.
బాదంపప్పుల్లోని విటమిన్ ఇ, కాల్షియం (Calcium), మెగ్నీషియం (Magnesium), కాపర్, రైబోఫ్లావిన్ (Riboflavin), పొటాషియం, ఐరన్, జింక్, బి విటమిన్లు, నియాసిన్ వంటి పోషకాలు దట్టంగా ఉంటాయి. కాగా బాదం పప్పుల్ని ప్రతి రోజూ నానబెట్టి లేదా డైరెక్ట్ గా కూడా తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని తరచూ నిపుణులు సూచిస్తూనే ఉంటారు.
బాదం స్కిన్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుతుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మేలు చేస్తుంది.కాగా ఈ రెండింటినీ కలిపి తింటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని తాజాగా నిపుణులు సూచిస్తున్నారు. హెయిర్ స్ట్రాంగ్‌గా, పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే జీవక్రియ మెరుగుపడటమే కాకుండా.. అదనపు కేలరీలను బర్గ్ (Burn calories) చేయడానికి కూడా మేలు చేస్తాయి. కాగా నైట్ నిద్రపోయే ముందు రెండు స్పూన్ల తేనెలో నాలుగదు బాదం నానబెట్టి.. మార్నింగ్ సమయంలో ఖాళీ స్టమక్‌తో తినాలని, జ్జాపకశక్తి సమస్యను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.