ఏ ప్రభుత్వానికి దక్కని గౌరవం ఈ ప్రభుత్వానికి దక్కుతోంది.. కేంద్రమంత్రి ట్వీట్

by Ramesh Goud |
ఏ ప్రభుత్వానికి దక్కని గౌరవం ఈ ప్రభుత్వానికి దక్కుతోంది.. కేంద్రమంత్రి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏ ప్రభుత్వానికి లభించని గౌరవం నేడు మోదీ ప్రభుత్వానికి లభిస్తోందని, మోడీ అవిశ్రాంతమైన కృషికి నిదర్శనమే ఈ అసాధారణ విజయమని కేంద్ర బొగ్గు గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International Manetory Fund) డాటా ప్రకారం.. గత పదేళ్లలో ఇండియా జీడీపీ (Indian GDP) 105 శాతం వృద్ధి చెంది, దిగ్గజ దేశాలను వెనక్కి నెట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఈ డాటాకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)పై ప్రశంసల వర్షం కురిపించారు.

దీనిపై ఆయన.. 2015 లో 2.1 ట్రిలియన్ డాలర్లు గా ఉన్న జీడీపీని గత 10 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోని మరే ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ సాధించనంతగా 105 శాతం వృద్ధితో 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు చేర్చి భారతదేశం ఒక అద్భుతమైన ఆర్థిక మైలురాయిని సాధించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మకమైన నాయకత్వానికి, అవిశ్రాంతమైన ప్రభుత్వ కృషికి నిదర్శనమే ఈ అసాధారణ విజయమని కొనయాడారు. అంతేగాక చురుకైన ఆర్థిక విధానాలు, సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యాపారం చేయడంలో సౌలభ్యంపై నిరంతరం దృష్టి సారించడం ద్వారా, మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేర్చిందని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వానికి లభించని గౌరవం నేడు మోదీ ప్రభుత్వానికి లభిస్తోందని చెప్పారు. నేడు, మనం చూస్తున్న ఈ పరివర్తనాత్మక కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక విస్తరణను ముందుకు నడిపించడమే కాకుండా, సాంప్రదాయ ప్రపంచ శక్తి కేంద్రాల కంటే ముందు స్థానంలో భారత్ ను ఉంచుతున్నాయని వివరించారు. ఇది ప్రపంచ ఆర్థిక దృష్టికోణంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed