Boeing: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన బోయింగ్..!

by Shamantha N |
Boeing: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన బోయింగ్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసింది. బెంగళూరులోని బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (BIETC) 180 మంది ఉద్యోగులకు పింక స్లిప్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటున్న బోయింగ్.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా బెంగళూరులోని ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్ లో 180 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అయితే ఉద్యోగులను గతేడాది డిసెంబర్ త్రైమాసికంలోనే తొలగించినట్లు తెలిపింది. బెంగళూరులోని బోయింగ్ కంపెనీ యూఎస్ వెలుపల ఉన్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. అయితే, సిబ్బందిని తొలగించినప్పటికీ, కొత్త పోస్టులు కూడా సృష్టించినట్లు తెలుస్తోంది. కస్టమర్ సేవ, భద్రత, నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడంపై స్పష్టమైన దృష్టి సారించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది బోయింగ్ అమెరికాలోని 17వేల మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 10శాతం కావడం గమనార్హం.

Next Story