- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చంద్రబాబు, పవన్, జగన్ మీ పార్టీలు గల్లంతే.. బీజేపీకి చావు డప్పే.. అద్దంకి ఘాటు వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీకి చావు డప్పు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఇవాళ తాజాగా ఒక వీడియోలో విడుదల చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పార్టీలు అంటున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే బీజేపీ నాయకులపై తిరుగుబాటు తప్పదు.. దక్షిణాది ప్రజలు బీజేపీని పాతాళానికి తొక్కడం ఖాయమన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పరమానందయ్య శిష్యుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ కూటమి నాయకుల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. (Chandrababu, Pawan, Jagan) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని అన్నారు. బీజేపీకి అడుగులకు మడుగులు ఒత్తే పార్టీలుగా మారిపోయారని చెప్పారు. రేపు ఆంధ్రప్రదేశ్‌కి నష్టం జరిగితే.. మీ పార్టీలు గల్లంతు అవుతాయనేది వాస్తవమని హెచ్చరించారు. జనగణన, మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ పట్ట కూల్‌గా ఉంటున్నారని అన్నారు. అలానే మీరు కూల్‌గా ఉంటే.. మిమ్మల్నీ ప్రజలు ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌గా ఉంచుతారని సెటైర్లు వేశారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడడం కోసం (Congress) కాంగ్రెస్, మిగతా పార్టీలు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.