మళ్లీ వార్తల్లో నిలిచిన 'యో యో' హనీ సింగ్.. ఈ సారి పబ్బులో

by Harish |
మళ్లీ వార్తల్లో నిలిచిన యో యో హనీ సింగ్.. ఈ సారి పబ్బులో
X

దిశ, సినిమా : 'బ్లూ ఐస్' పాటతో యూత్‌లో క్రేజ్ సంపాదించిన పాప్ సింగర్ హనీ సింగ్ వార్తల్లో నిలిచాడు. గత నెల 27న సౌత్ ఢిల్లీలోని ఓ పబ్‌లో తన కాన్సర్ట్‌ జరుగుతుండగా.. కొంత మంది గుంపుగా స్టేజి పైకి వచ్చి అతడి ప్రదర్శన అడ్డుకున్నారు. కాగా సదరు వ్యక్తులు తనను ఉద్దేశ్యపూర్వకంగానే బెదిరించడంతో పాటు గాయపరిచారని హనీ సింగ్ ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. విషయానికొస్తే.. 'నలుగురు, ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు హనీ సింగ్ పర్ఫార్మ్ చేస్తున్న క్రమంలో బీర్ బాటిల్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని, తనను కిందకు తోసేసి బెదిరింపులకు దిగారని, ఆ గుంపులో ఒక వ్యక్తి వీడియో తీస్తూ హనీ సింగ్‌ను తరిమికొట్టండని అరిచిచారని' మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ సంఘటన తర్వాత హనీ సింగ్, అతడి బృందం.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. హనీ సింగ్ భార్య షాలిని పాండే అతడిపై గృహహింస కింద కేసు పెట్టి పెనాల్టీగా రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed