- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చేనేత సహకార సంఘంలో హోలీ సెలబ్రేషన్స్.. చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
by samatah |

X
దిశ సిద్దిపేట: సిద్దిపేట చేనేత సహకార సంఘం కార్యవర్గం హోళి పండుగ వేడుకలను మందు, విందు ఏర్పాటు చేసుకొని ఘనంగా జరుపుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని గాంధీ నుండి కమాన్ రోడ్డు లో గల చేనేత సహకార సంఘంలో హోళి పండుగ పురస్కరించుకొని సంఘం నాయకులు రంగులు పూసుకున్న అనంతరం కార్యాలయంలోనే మందు, విందు ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేశారు. సంఘం భవనంలోనే మందు విందుతో సరదాగా గడిపారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా నో ఏమో కానీ చేనేత సహకార సంఘంలోనే ఇలా మందు తాగుతూ ఎంజాయ్ చేయడం పట్ల ఆనోట ఈనోట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Next Story