అంగన్వాడీ సెంటర్‌లో హోళీ సంబరాలు

by S Gopi |
అంగన్వాడీ సెంటర్‌లో హోళీ సంబరాలు
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ఎన్ని బాధలున్నా వాటన్నిటినీ మర్చిపోయి ఆనందంగా హోళీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్యానాయక్ కాలనీలో అంగన్వాడీ సెంటర్ లో టీచర్ రోజా పిల్లలకు హొళీ పండుగ ప్రాముఖ్యత, ఆచారాలు, రంగుల గురించి వివరించారు. రసాయన రంగులు వాడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పండుగ జరుపుకోవాలని పిల్లలకు సూచించారు. ఈ సందర్భంగా టీచర్ రోజా మాట్లాడుతూ...హోళీకి ఒకరోజు ముందు, హోళీకా దహన్ జరుపుకుంటారని, ఇది పౌరాణికం ప్రకారం.. ఈరోజున, విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటానికి.. ప్రహ్లాదుడి తండ్రి రాక్షస రాజు హిరణ్యకశపుడు, అతని సోదరి హోళీక మరియు దుష్టులను ఓడించాడని నమ్ముతారన్నారు. కాబట్టి హోళీ.. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed