- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న హిందూస్తాన్ మోటార్స్.!
కోల్‌కతా: దేశీయ అంబాసిడర్ కార్ల తయారీ సంస్థ హిందూస్తాన్ మోటార్స్ వచ్చే ఏడాదికి నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. దీనికోసం యూరప్‌కు చెందిన కంపెనీతో జాయింట్ వెంచర్ బాగస్వామ్యం ఏర్పరచుకోనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. మొదట ద్విచక్ర వాహనాల తయారీ తర్వాత ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ వాహనాలను తీసుకురానున్నట్టు హిందూస్తాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ పేర్కొన్నారు. ఈ నెలలో ఇరు సంస్థల మధ్య ఆర్థికపరమైన చర్చలు ప్రారంభమవుతాయని, దీనికి రెండు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత జాయింట్ వెంచర్‌కు సంబంధించిన టెక్నాలజీ అంశాలను పరిశీలిస్తామని, దీని మరో నెల రోజుల సమయం పడుతుందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పెట్టుబడులు, కొత్త కంపెనీ ఏర్పాటు వంటి పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వాహనాల ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. ద్విచక్ర వాహానాల అమ్మకాలు ప్రారంభమైన రెండేళ్లకు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.