- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తలపై వేసే కేసుల విషయంలో మహిళలను జాగ్రత్తగా ఉండాలన్న హైకోర్టు..
దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహాజం. కానీ ఈరోజుల్లో చాలా మంది చిన్న వాటికి కూడా పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ పోలీసులు, కోర్టుల వరకు వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు. అయితే చాలా మంది భార్యలు భర్తలపై ఎన్నో రకాల కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసు ఒకటి ఇటీవల కోర్టు వరకు వెళ్లింది. అయితే అందులో భాగంగా కోర్టు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ఓ మహిళ తన భర్త, వారి కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. సదరు మహిళ ఆత్యహత్య కూడా చేసుకునట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు వల్ల ఆమె భర్తను నిర్భంధంలోకి తీసుకున్నారు. అయితే వాస్తవానికి ఆ మహిళ బ్రతికే ఉంది కావాలని భర్త వారి కుటుంబ సభ్యులపై కుట్ర పన్ని కేసు పెట్టిందని కోర్టు పరిశీలించి వివరాలను సేకరించి వివరించింది. అంతే కాకుండా మహిళలు వేసే ఫేక్ కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అలాంటి తప్పుడు కేసులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తద్వారా సమాజంలో సంబంధాలను కాపాడాలని పేర్కొంది. లేదంటే ఈ తీరు చట్టాన్ని దుర్వినియోగ పరిచే అవకాశంగా మారుతుందని హైకోర్టు హెచ్చరించింది.