బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కోసం సన్ మొబిలిటీతో హీరో ఎలక్ట్రిక్ ఒప్పందం!

by Harish |
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కోసం సన్ మొబిలిటీతో హీరో ఎలక్ట్రిక్ ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ 10,000 ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అందించేందుకు సన్ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సుమారు 10 వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఈ టెక్నాలజీ సహకారాన్ని సన్ మొబిలిటీ అందించనుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వృద్ధి అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈవీలకు బ్యాటరీ స్వాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కొనుగోలు ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. మెరుగైన జీవితకాలంతో వచ్చే బ్యాటరీల ద్వారా వినియోగదారులకు ఇతర వ్యయాలు తగ్గుతాయని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.

బ్యాటరీలను రీఛార్జ్ కోసం సమయాన్ని వృధా చేయకుండా ఎలక్ట్రిక్ టూ-వీలర్లను కొనేవారికి అనువైన ప్రాంతాల్లో స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఈ విధానం వల్ల బ్యాటరీ స్వాపింగ్ విభాగం వృద్ధికి అవకాశం ఉంటుందని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల పరిశ్రమలో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ విభాగంలో మెరుగైన విధానాలను అనుసరించి డిమాండ్‌ను వేగవంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సున్ మొబిలిటీ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్ చేతన్ మైని వెల్లడించారు.

Advertisement

Next Story