వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీ ప్రజలు అలర్ట్

by Javid Pasha |   ( Updated:2022-03-05 05:03:59.0  )
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీ ప్రజలు అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుడం కొనసాగుతోంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది. ఇది సాయంత్రం వరకు తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వ్యాపించనున్నాయి. దీంతో తమిళానాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా వాయుగుడం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఏపీలో మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed