- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండెపోటుకు శరీరమందించే ముందస్తు సిగ్నల్స్!
దిశ, ఫీచర్స్ : 'గుండె జబ్బు' శరీరంలో అకస్మాత్తుగా వచ్చే రుగ్మత కాదు. ఇది కొన్ని నెలలు, సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతుంది. అయితే దీన్ని గుర్తించే సమయానికే మొత్తం ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయొచ్చని, అందుకే గుండె జబ్బులను సైలెంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ హార్ట్ ఎటాక్స్‌కు ముందు కొన్ని సాధారణ సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రారంభ దశలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో పాటు దీర్ఘాయువు పొందవచ్చని అంటున్నారు.
చర్మంపై నీలిరంగు లేదా ఊదా రంగులో గజిబిజిగా వల మాదిరిగా గుర్తులు కనిపిస్తాయి. అలాంటివి గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది ఇన్ఫెక్షన్ లేదా దద్దుర్లుగా భావించి విస్మరించవద్దు. బదులుగా వెంటనే చర్య తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ధమనులు బ్లాక్ అయినప్పుడు కొలెస్ట్రాల్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య కారణంగా ఈ నెట్ లాంటి నమూనా కనిపిస్తుందని ఎక్స్‌పర్ట్స్ పేర్కొన్నారు.
చర్మంపై పసుపురంగు సూచికలు :
చాలా మంది తమ చర్మం కింద పసుపు లేదా నారింజ రంగులో ప్యాచ్‌లను కలిగి ఉంటారు. ఈ నిక్షేపాలు కళ్ల మూలల్లో ఎక్కువగా, కాళ్ల వెనుక భాగంలో తక్కుగా కనిపిస్తాయి. నొప్పిలేకుండా ఉన్నప్పటికీ ఈ సంకేతాలను గుర్తించలేం. ఈ పరిస్థితి తలెత్తితే వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిని చెక్ చేసుకుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి.
వ్యాక్స్ బంప్స్:
చూసేందుకు కొవ్వొత్తి ముద్దలా కనిపించే చిన్న చిన్న గడ్డలు చర్మంపై దర్శనమిస్తుంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్‌కు ఇది సంకేతం. ప్రారంభ దశలో ఇవి దద్దుర్లు మాదిరిగా ఉండవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే చర్మం కింద ఈ రకంగా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
రౌండ్ అండ్ స్పెరికల్ నెయిల్స్:
వైద్యపరంగా వీటిని 'క్లబ్బింగ్ నెయిల్స్'గా పిలుస్తారు. గోర్ల ఆకృతిలో ఈ రకమైన మార్పు.. హై లెవెల్ కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉంటుంది. ఇలాంటి అసాధారణతలు ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సమస్యల్లో కూడా కనిపిస్తాయి.
గోరుపై ఎర్రటి గీతలు:
గోర్లపై ఎరుపు లేదా ఊదా రంగు గీతలు ఏర్పడ్డాయంటే శరీరానికి ఏదో సరిగ్గా అందడం లేదనేందుకు స్పష్టమైన సూచన. గుండె జబ్బులు సహా అనేక శరీర వ్యాధులకు గోర్లు సూచికలుగా ఉపయోగపడతాయి. ఒకవేళ ఆలస్యమైనా సరే.. గోర్లలో ఏవైనా అసాధారణతలు గమనించిస్తే లేదా మునుపటిలా లేకుంటే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నొప్పి కలిగించే గడ్డలు:
ఎటువంటి కారణం లేకుండా చాలా రోజుల పాటు చేతి, కాలి వేళ్లలో నొప్పి కలిగించే గడ్డలు కనిపిస్తుంటాయి. బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మించిపోవడానికి ఇదే నిదర్శనం. వాటంతట అవే వెళ్లిపోతున్నప్పటికీ గడ్డలు పునరావృతం కావడాన్ని తేలికగా తీసుకోకూడదని పరిశోధకులు సూచించారు.