- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏ స్థానంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్సీ
దిశ, తెలంగాణ బ్యూరో : ఏ స్థానంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మండలి చైర్మన్‌గా 21 నెలలు పని చేసిన అనుభవం ఉందన్నారు. ఆదివారం రెండో సారి శాసన పరిషత్ చైర్మన్‌గా నామినేషన్ వేసిన సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్‌గా అందరిని సమానంగా చూశానని, ఇప్పుడూ చూస్తానని అందుకే సీఎం కేసీఆర్ రెండోసారి చైర్మన్‌గా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
మండలి చైర్మన్‌గా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 15 ఏళ్ల పాటు ఎంపీగా పని చేశానని, సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకు ఉందని ఆయన అన్నారు. నమ్మకం విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన సీఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష స్థానానికి న్యాయపరంగా, చట్టపరంగా కృషి చేస్తానని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు వి గంగాధర్ గౌడ్, బండ ప్రకాష్, టిఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.