42 అడుగుల పొడవాటి గోళ్లు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన మహిళ

by sudharani |   ( Updated:2023-10-10 15:58:40.0  )
42 అడుగుల పొడవాటి గోళ్లు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా కొత్తగా ట్రై చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. గోల్‌ను రీచ్ అయ్యేందుకు ఎన్నేళ్లయినా ఓపికతో కృషి చేస్తుంటారు. సరిగ్గా అలాంటి పట్టుదలతో ఓ మహిళ సుమారు నాలుగంతస్థుల పొడవున్న వేలిగోళ్లను పెంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది.

అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంక్.. గత 25ఏళ్లుగా చేతి వేళ్ల గోళ్లను పెంచడంతో స్వేచ్ఛగా తిరగలేకపోతుంది. దాదాపు 42 అడుగుల 10.4 అంగుళాల పొడవుతో ఉన్న గోళ్లతో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ సృష్టించిన ఆమె.. తన 16ఏళ్ల కుమార్తె లతీషా ఆస్తమా ఎటాక్‌తో చనిపోయిన తర్వాత చివరిసారిగా గోళ్లను కత్తిరించుకున్నానని , 'అది నా జీవితంలో వరెస్ట్ డే' అని చెప్పింది. చనిపోయిన తన కూతురు గుర్తుగా వీటిని పెంచుకుంటున్నానని తెలపడంతో.. చాలా మంది వీటి గురించి అడగడం మానేశారని పేర్కొంది. ఈ మేరకు ఆర్మ్‌స్ట్రాంగ్ గోర్లు ఒక్కొక్కటి పెయింట్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల మధ్య పడుతుందని.. ఈ ప్రక్రియలో 15 నుంచి 20 నెయిల్ పాలిష్ సీసాలు అవుతాయని తెలిపింది.

Advertisement

Next Story