బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్లపై ఉక్కుపాదం.. సుమారు 500లకు పైగా కేసులు

by Manoj |
బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్లపై ఉక్కుపాదం.. సుమారు 500లకు పైగా కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాహనాలపై బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్లను దుర్వినియోగం చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గ్రేటర్‌లో రెండువారాల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అనధికారికంగా పోలీసు, ఆర్మీ, ప్రెస్, ఎమ్మెల్యేల పేరిట స్టిక్కర్లతో తిరుగున్న వాహనాలను చూసీ చూడనట్లు వదిలేసిన ట్రాఫిక్ పోలీసులు ఇక కఠిన చర్యలు చేపడుతున్నారు. ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ తో జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదంతో పోలీసులు అప్రమత్తమైన బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్లను దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. మూడ్రోజుల్లోనే 500లకు పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం.

జడ్‌ప్లస్‌ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్‌ ఫిల్మ్‌ వాడొద్దనే నిబంధనలు ఉన్నాయి. అంతేగాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలనే నిబంధన. కానీ అందుకు విరుధంగా కొందరు నకిలీ పోలీస్​, ఆర్మీ, ప్రెస్‌ అని స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బోధన్‌‌ ఎమ్మెల్యే పేరుతో కారు‌‌ స్టిక్కర్‌‌ ఉన్న కారు ప్రమాదంతో హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్​ చేపట్టారు. ఫేక్​ స్టిక్కర్లపై నజర్ పెట్టారు. గ్రేటర్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే పాస్​లను బంధువులు, స్నేహితులు వినియోగిస్తుండటంతో అవి దుర్వినియోగం అవుతున్నాయి. అలాంటి వారిపై సీఎంవీ రూల్స్ 1989 ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్లను అతికించిన ఒక్కో వాహనంపై 700లకు పైగా జరిమానా విధించడంతో పాటు వాటిని తొలగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed