- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీపీని కొలిచే 'టాటూ'..
దిశ, ఫీచర్స్ : సాధారణంగా రక్తపోటు (Blood pressure- BP) కొలిచేందుకు ఏదో ఒక చెయ్యికి పట్టీ వేసి స్మిగ్మోమానోమీటర్ సాయంతో రీడింగ్ చూస్తారు. కానీ రెండు చేతులను విడివిడిగా చూసినప్పుడు బీపీ రీడింగ్ సమానంగానే ఉంటుందా? అంటే వేర్వేరుగా కూడా ఉండొచ్చు. అయితే బీపీని మిల్లీమీటర్లలో కొలుస్తారు కాబట్టి రెండు చేతుల బీపీ రీడింగ్‌లో పది మిల్లీమీటర్లకు మించి తేడాలు ఉంటే ఇది ఛాతిలో నొప్పి, గుండెపోటు వచ్చే ప్రమాదముందని, అదే ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ తేడా ఉంటే వారికి గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని భావించాలని తాజా అధ్యయనం వెల్లడించింది. నిజానికి ఈ పద్ధతిలో కొలిచే బీపీ మొత్తం చిత్రాన్ని సంగ్రహించదు ఇది కేవలం ఒక డేటా పాయింట్ మాత్రమే, అది ఆ సమయంలో ఒక వ్యక్తి మానసిక స్థితి ద్వారా ప్రభావితమవుతుంది. ఇలాంటి తేడాలు రాకుండా ఉండేందుకు కొత్త బీపీ మీటర్ 'టాటూ' వచ్చింది.
శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి నిరంతర పర్యవేక్షణ అవసరం కాగా క్లినిక్ వెలుపల ఇది సాధ్యమయ్యే పనికాదు. అయితే స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ ట్రాకర్స్ ఈ సమస్యలకు కొంతవరకు సమాధానంగా అనిపించవచ్చు. కానీ అవి ఇంకా తగినంత విశ్వసనీయంగా లేవు. కాబట్టి కొత్త అధ్యయనం కోసం టెక్సాస్ A&M సహా ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోగి రక్తపోటును నిరంతరం పర్యవేక్షించగల కొత్త ఎలక్ట్రానిక్ 'టాటూ'ను అభివృద్ధి చేశారు. ఈ-టాటూగా పిలుస్తున్న దీన్ని గ్రాఫేన్‌తో తయారుచేయగా సెన్సార్‌తో కూడిన స్టిక్కీ మెటీరియల్‌తో స్కిన్‌పై అమర్చుతారు. ఇది మెరుగైన ఆరోగ్య డేటాను అందిస్తుండగా, ఇతర ఈ-టాటూలు కార్డియాక్ పేషెంట్ల హృదయ స్పందనలను, వ్యాయామం చేసే సమయంలో ముఖ్యమైన సంకేతాలను లేదా న్యూరోడీజెనరేటివ్ రోగుల కండరాలను పర్యవేక్షించేందుకు రూపొందించబడ్డాయి.
ఈ కొత్త పరికరం రక్తపోటు కొలతలను కొత్త పద్ధతిలో అందిస్తుంది. దీంతో సదరు రీడింగ్స్ విశ్లేషించేందుకు మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఈ మేరకు పరిశోధకులు చేసిన ప్రయోగ ఫలితాల్లో ఈ-టాటూ ధమనుల్లో రక్తపోటును కచ్చితంగా పర్యవేక్షించగలిగింది. అంతిమంగా, ఈ సాంకేతికతను ఈ-టాటూలుగా అభివృద్ధి చేయాలని బృందం భావిస్తోంది. రోగులు నిద్రించిన వేళ, వ్యాయామం చేస్తున్నప్పుడు, ఒత్తిడిగా ఉన్న సమయాల్లో ఇలా అనేక సందర్భాల్లో వారి రక్తపోటును కొలవడానికి దీర్ఘకాలికంగా ఈ టాటూలను ఉపయోగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితులను నిర్ధారించడంలో లేదా పర్యవేక్షించడంలో సాయపడేందుకు ఈ డేటా కీలకంగా భావిస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితం నేచర్ నానోటెక్నాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమైంది.