వాహనాలకు ఏటీఎస్ ద్వారా మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్!

by Harish |   ( Updated:2022-04-07 16:36:06.0  )
వాహనాలకు ఏటీఎస్ ద్వారా మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్!
X

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దశలవారీగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్(ఏటీఎస్) ద్వారా మాత్రమే వాహనాలు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వస్తువుల సరఫరా, భారీ ప్రయాణీకుల మోటారు వంటి రవాణా వాహనాలు 2023 నుంచి ఏటీఎస్ ద్వారా మాత్రమే ఫిట్‌నెట్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

అయితే, మధ్యస్థ వస్తు రవాణా, ప్యాసింజర్ వాహనాలకు, లైట్ మోటార్ వాహనాలకు ఈ నిబంధన 2024, జూన్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 8 ఏళ్ల పాత వాహనాలకు రెండేళ్లు, అంతకుమించి పాతవైన వాటికి ఒక ఏడాది పాటు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను ఏటీఎస్ ఇవ్వనుంది. వాహనానికి సంబంధించి ఫిట్‌నెస్‌ని తనిఖీ చేసేందుకు ఆటోమెటిక్ పద్దతిలో మెకానికల్ పరికరాలను ఏటీఎస్‌లో ఉపయోగించనున్నారు. ఈ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కంపెనీలు ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు వీలుగా ఏటీఎస్ కేంద్రాల ఏర్పాటుకు గతేడాది అనుమతులను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed