- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంట నూనె ధరలు తక్షణమే రూ. 15 తగ్గించాలని కేంద్రం ఆదేశం!
న్యూఢిల్లీ: వంట నూనెల గరిష్ట రిటైల్ ధర(ఎంఆర్‌పీ)లను తక్షణమే రూ. 15 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వంటనూనె తయారీదారులను ఆదేశించింది. ఈ వారం ప్రారంభంలో ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండె వంటనూనె సంఘాలు, ప్రధాన తయారీ కంపెనీలతో ధరలకు సంబంధించి చర్చించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తయారీదారులు, శుద్ధి చేసే పంపిణీదారులు తక్షణమే వంటనూనె ధరలను తగ్గించాలని సూచించింది. తయారీదారులు, రిఫైనర్లు పంపిణీదారులకు ధరల తగ్గింపు అమలు చేయడం ద్వారా వినియోగదారులకు ఆ ప్రయోజనాలు అందుతాయని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.
అంతేకాకుండా ప్రభుత్వం సూచించిన ధరలను తగ్గించని, ఇతర వంటనూనె బ్రాండ్‌ల కంటే ఎక్కువ ధరకు విక్రయించే కంపెనీలు సైతం తక్షణనే ఈ తగ్గింపును అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదివరకు మేలో ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వంటనూనె దిగుమతులపై కేంద్రం సుంకాన్ని రద్దు చేసింది. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనాలు అందాయి. గత నెలలో సైతం అనేక వంటనూనె బ్రాండ్ కంపెనీలు లీటర్‌కు రూ. 10-15 వరకు తగ్గించాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సానుకూల పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నాయి.