- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ప్రసంగం లేకున్నా.. నా సంతకం కావాల్సిందే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగడంతో బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అని, ఇది గత సెషన్‌కు సంబంధించి కొనసాగింపు అని చెప్పారు. ఈ క్రమంలో దీనిపై గవర్నర్ తమిళి సై మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతిపెద్ద పొజిషన్‌లో ఉన్నప్పటికీ అణిచివేతకు గురవుతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది మరువకముందే.. తమిళనాడులోని పుదుచ్చేరిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. టెక్నికల్ రీజన్స్ చూపించి గవర్నర్ ప్రసంగం రద్దు చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చు కానీ గవర్నర్ సంతకం లేకుండా బడ్జెట్ ఆమోదించలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.