- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోగి సహాయకులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగి సహాయకులకూ భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా తొలి విడత హైదరాబాద్లోని 18 మేజర్ ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రెండు పూటలా భోజనం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రతి రోజు సుమారు 18,600 మందికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 38.66 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రుల్లోనూ అందించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం రోగులకు మాత్రమే భోజనం పెడుతున్నారు. దీంతో రోగితో పాటు ఆసుపత్రికి వచ్చిన అటెండర్లు బయటకు వెళ్లి తినాల్సి వస్తున్నది. దీంతో పేషెంట్లకు ఆర్థిక భారమే కాకుండా పేషెంట్ దగ్గర నిత్యం పర్యవేక్షించేందుకు వెసులుబాటు ఉండడం లేదు. దీంతో రోగి సహాయకులకు సబ్సిడీ విధానంలో ఆహారం ఇవ్వాలని సర్కార్ ప్రయత్నిస్తున్నది.