Google నుంచి Android 13 వెర్షన్‌.. ఫీచర్స్ ఇవే!

by Disha Desk |
Google నుంచి Android 13 వెర్షన్‌.. ఫీచర్స్ ఇవే!
X

దిశ వెబ్‌డెస్క్: ప్రపంచ సెర్చ్ ఇంజిన్ Google సరికొత్త Android 13 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మొదటి డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసింది. ఇది Android 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా కొత్త ఫీచర్లతో వస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన థీమ్‌లు, గోప్యతా ఫీచర్‌లు ఈ కొత్త వెర్షన్‌లో ఉన్నాయి. గూగుల్ తన ఆండ్రాయిడ్ 13 OS కోసం లాంచ్ టైమ్‌లైన్‌ను కూడా షేర్ చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఆండ్రాయిడ్ 13 రెండు డెవలపర్ ప్రివ్యూలు ఒక్కొక్కటి ఫిబ్రవరి, మార్చిలో వస్తాయి. దీని తరువాత, ఏప్రిల్, మే, జూన్, జూలైలలో ఒక్కొక్కటి నాలుగు బీటా వెర్షన్‌లను విడుదల చేస్తుంది. ఆండ్రాయిడ్ 13లో తుది వెర్షన్ ఆగస్టు-సెప్టెంబర్‌లో ఎప్పుడైనా రావచ్చు.

Google Android 13తో తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎకోసిస్టమ్‌కి అనేక కొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లను పరిచయం చేసింది.

ఫొటో పికర్: Google, Android 13తో కొత్త ఫొటో పికర్ సిస్టమ్‌ను పరిచయం చేస్తోంది. ఇది యాప్‌లలో సురక్షితంగా ఫోటోలు వీడియోలను షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ ప్రస్తుత డాక్యుమెంట్ పికర్ అన్ని మీడియా ఫైల్‌లను వీక్షించడానికి అనుమతి అవసరం లేకుండా, షేర్ చేసిన ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేయడానికి యాప్‌లు ఫొటో పికర్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

థీమ్ యాప్ చిహ్నాలు: ఆండ్రాయిడ్ 13 తో, ఇప్పటికే ఉన్నటువంటి యూ డైనమిక్ కలర్ ఫంక్షనాలిటీని Google ఇతర యాప్‌లకు కూడా విస్తరిస్తోంది. ఇది వినియోగదారులు తమ వాల్‌పేపర్, ఇతర థీమ్ ప్రాధాన్యత చిహ్నాలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. సిస్టమ్ లాంగ్వేజ్ కోసం భిన్నమైన ఇతర స్థానిక భాషను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతించే మరో ఫీచర్ కూడా రానుంది. ఆండ్రాయిడ్ 13 లో Wi-Fi ద్వారా దగ్గరలోని ఇతర పరికరాలకు కనెక్ట్ కావడానికి లొకేషన్ అనుమతి లేకుండా కనెక్ట్ చేయడానికి కొత్త్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. వీటితో పాటు ఇంకా కొన్ని అధునాతనమైన సెక్యూరిటీ ఫీచర్లను కూడా కొత్త వెర్షన్‌లో Google తీసుకురానుంది.

Advertisement

Next Story