- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాక్ట్‌చెకర్స్, జర్నలిస్ట్‌లను ఆహ్వానిస్తున్న గూగుల్!
దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్ తన న్యూస్ ఇనిషియేటివ్ ట్రైనింగ్ నెట్‌వర్క్‌లో పంజాబీ, అస్సామీ, గుజరాతీ, ఒడియా, మలయాళం తదితర ఐదు కొత్త భాషలను చేర్చుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాదు గూగుల్ డేటా లీడ్స్ భాగస్వామ్యంతో Fact-Check అకాడమీని కూడా ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ తప్పుడు సమాచారాన్ని పరిష్కరించేందుకు, తప్పుదోవ పట్టించే డేటా, తప్పుడు నంబర్స్ కలిగి ఉన్న క్లెయిమ్స్‌ను ధృవీకరించే సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడేందుకు ఇప్పటికే సుమారు 100 మంది కొత్త ట్రైనీస్‌ను కూడా చేర్చుకున్నట్లు వెల్లడించింది.
Google న్యూస్ ఇనిషియేటివ్ ఇండియా ట్రైనింగ్ నెట్‌వర్క్ 2018లో ప్రారంభించగా.. డేటాలీడ్స్‌తో పాటు, ఈ నెట్‌వర్క్‌లో 39,000+ జర్నలిస్టులు, మీడియా అధ్యాపకులు, ఫ్యాక్ట్-చెకర్లు ఉన్నారు. కనీసం 10 భాషల్లో 2300 న్యూస్‌రూమ్స్, మీడియా కాలేజీల నుంచి జర్నలిజం విద్యార్థులు పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ తప్పుడు సమాచారాన్ని ధృవీకరించేందుకు, పరిష్కరించడానికి అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవడంలో జర్నలిస్టులు, న్యూస్‌రూమ్‌లకు నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది.
లెర్నింగ్ వెరిఫికేషన్ స్కిల్స్, టెక్నిక్స్ సహా సాంకేతికతలను నిపుణుల నుంచి నేర్చుకోవడం ద్వారా మీడియా తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడంలో సహాయపడేందుకు టెక్ దిగ్గజం జర్నలిస్టులతో పాటు జర్నలిజం ప్రొఫెసర్, ఫ్యాక్ట్-చెక్ అకాడమీ కోసం ఫ్యాక్ట్-చెకర్లను కూడా ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టులో షెడ్యూల్ చేసిన 3-రోజుల ట్రైన్-ది-ట్రైనర్ బూట్ క్యాంప్‌లో శిక్షణ అందిస్తారు. ఇందులో భాగంగా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 30 చివరి తేదీ అని గూగుల్ తెలిపింది.