- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen: విశ్వక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘మెకానిక్ రాకీ’ మూవీ నుంచి డబుల్ అప్డేట్స్
దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky). ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి(Ravi Teja Mullapudi) తెరకెక్కిస్తుండగా.. రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్(Sunil), నరేష్, హర్ష, చెముడు, హర్ష వర్ధన్, హైపర్ ఆది కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ‘మెకానిక్ రాకీ’ వాయిదా పడినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ ‘మెకానిక్ రాకీ’ నుంచి డబుల్ అప్డేట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 20 (October 20) రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నవంబర్ 22(November 22)న ‘మెకానిక్ రాకీ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఘనంగా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో విశ్వక్ సేన్ అభిమానులు కాస్త నిరాశకు గురైనప్పటికీ ట్రైలర్ అప్డేట్ ఇవ్వడంతో ఖుషీ అవుతున్నారు.