- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పుంజుకోనున్న ఎఫ్ఎంసీజీ రంగం: గోద్రేజ్ కన్స్యూమర్!
దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(జీసీపీఎల్) రాబోయే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న వినియోగ మందగమనం, ద్రవ్యోల్బణ ఒత్తిడి నెమ్మదిస్తుందని, తద్వారా మార్జిన్లు మెరుగుపడటమే కాకుండా అమ్మకాలు కూడా కోలుకుంటాయని గోద్రేజ్ కన్స్యూమర్ సీఈఓ సుధీర్ సీతాపతి అన్నారు. ప్రధానంగా దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో మెరుగైన వృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇంటికి అవసరమైన క్రిమిసంహారక, హెయిర్ కేర్, హెయిర్ కలర్స్ విభాగంలో తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం త్రైమాసికంతో పాటు రాబోయే ఏప్రిల్ -జూన్‌లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు సుధీర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో పాటు సంబంధిత సవాళ్లు క్రమంగా నెమ్మదిస్తున్నాయని, దీనివల్ల రానున్న రోజుల్లో వ్యాపారం క్రమంగా పుంజుకుంటుందన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తుందనే నమ్మకం ఉందని, తమకు ప్రధాన విభాగాలైన 'హిట్' బ్రాండ్ లాంటి ఇంటి క్రిమిసంహారక ఉత్పత్తులు, హెయిర్ కేర్, హెయిర్ కలర్స్‌లలో మెరుగైనా సామర్థ్యాన్ని కొనసాగించలమని, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలకు సంబంధించి మరింత ఎక్కువ వాటా సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని సుధీర్ సీతాపతి వెల్లడించారు.