Dhavaleswaram barrage: ప్రమాదకరంగా మారిన పరిస్థితి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద హైఅలర్ట్

by GSrikanth |   ( Updated:2022-07-14 08:50:15.0  )
Godavari Crosses Third Danger Mark at Dhavaleswaram barrage
X

దిశ, వెబ్‌డెస్క్: Godavari Crosses Third Danger Mark at Dhavaleswaram barrage| ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమ క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి వరద కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బ్యారేజ్ నుంచి 22 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తే.. పరిస్థితులు ప్రమాదకరంగా మారనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 30 చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భద్రాచలం జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్(NDRF), 5 ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలు పాల్గొన్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: రొయ్య ముక్కులోకి దూరి ఎంత పని చేసింది... అతడి అవస్థలు చూస్తే..

Advertisement

Next Story