వచ్చేసిన ‘కుబేర’ గ్లింప్స్.. ఇంట్రెస్టింగ్‌గా ఆ ముగ్గురి పాత్రలు (వీడియో)

by Hamsa |   ( Updated:2024-11-15 15:56:13.0  )
వచ్చేసిన ‘కుబేర’ గ్లింప్స్.. ఇంట్రెస్టింగ్‌గా ఆ ముగ్గురి పాత్రలు (వీడియో)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్(Dhanush), కింగ్ నాగార్జున కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera). శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఓల్ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల తమిళంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ధనుష్, నాగార్జున(Nagarjuna), రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తన X ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు. ఇక గ్లింప్స్(glimpse) విషయానికి వస్తే.. స్టార్టింగ్‌లో ఓ బిచ్చగాడిగా ధనుష్ దర్శనమిస్తాడు. ఇక నాగార్జున చాలా డబ్బు ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. ఇక రష్మిక ఎవరికోసమో వెతుకుతున్నట్లు, ఆమె వెనుక ఎవరో పడుతున్నట్లు చూపించగా.. మళ్లీ లాస్ట్‌లో ధనుష్ డబ్బు ఉన్న వ్యక్తిగా మారిపోతాడు. అసలు బిచ్చగాడి(beggar)గా ఉన్న ధనుష్ కుబేరుడు ఎలా అయ్యాడు.. నాగార్జునకు ఏం అయింది.. రష్మిక ఎవరికోసం వెతుకుతోంది అనేది సినిమా కథ. ఈ గ్లింప్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. డీఎస్‌పీ(DSP) బీజీఎమ్ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


Read More..

రష్మిక మందన్న ఫేవరెట్ సాంగ్స్ ఆ రెండే..



Advertisement

Next Story

Most Viewed