- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిజాబ్ ధరించిన యువతి ప్రధాని కావచ్చు: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
లక్నో: లోక్‌సభ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యతులో హిజాబ్ ధరించిన యువతి దేశ ప్రధాని కావచ్చని అన్నారు. యూపీలో ఎన్నికల ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కర్ణాటకలో హిజాబ్ వివాదం నెలకొన్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 'హిజాబ్ ధరించిన అమ్మాయిలు కాలేజీలకు వెళ్తారు. కలెక్టర్లు, మెజిస్ట్రేట్, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అవుతారు. నేను బహుశా చూడచ్చు, చూడకపోవచ్చు. కానీ నా మాటలు గుర్తుంచుకొండి. ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన యువతి తప్పక ప్రధాని అవుతుంది' అని అన్నారు. ఒకవేళ యువతులు హిజాబ్ ధరించాలనుకుంటే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పాలన్నారు. వీరిని ఎవ్వరూ ఆపుతారో చూద్దామని చెప్పారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై పలువురు నేతలు ఖండించారు. మతతత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలకు చోటివ్వమని యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ అన్నారు.