యోగా టిప్.. నౌకాసనం ఎలా వేయాలి

by Manoj |
యోగా టిప్.. నౌకాసనం ఎలా వేయాలి
X

దిశ, ఫీచర్స్: ఈ ఆసన స్థితి నౌకను పోలి ఉంటుంది కాబట్టి 'నౌకాసనం' అనే పేరొచ్చింది. ముందుగా పాదాలను ముందుకు చాచి, చేతులను శరీరానికి సమాంతరంగా ఉంచి నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను ఒక దగ్గరికి తీసుకురావాలి. మోకాళ్ల కింది నుంచి చేతుల సపోర్ట్ ఇస్తూ శరీరానికి సమాంతరంగా కాళ్లను పైకెత్తాలి. శరీరం వెనుకకు పడిపోకుండా చేతులను కాళ్లకు ఇరుపక్కల ఉంచి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ స్థితిలో పాదాలు రెండు దగ్గరగా ఉంచి నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పాదాలు రెండింటినీ పైకి తీసుకురావాలి. మోకాళ్లు వంచకూడదు. రెండు చేతులను నేలకు సమాంతరంగా ఉంచాలి. అరచేయి నేలవైపు ఉండాలి. ఇదే స్థితిలో 8 సెకన్ల పాటు ఉన్న తర్వాత గాలి వదులుతూ మామూలు స్థితికి రావాలి.

ఉపయోగాలు :

* ఆకలిని అదుపులో ఉంచుతుంది.

* పొట్ట దగ్గర కొవ్వును కరిగిస్తుంది.

* నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలను ఉత్తేజపరుస్తుంది.

* శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపించి ఒత్తిడిని తగ్గిస్తుంది.

* పీసీఓఎస్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

జాగ్రత్తలు :

* హెర్నియా, స్టమక్ అల్సర్ ఉన్నవారు చేయకూడదు.

Advertisement

Next Story

Most Viewed