- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కటైన గే కపుల్.. ఘనంగా వివాహ వేడుకలు!
దిశ, ఫీచర్స్ : భారతదేశంలో ఇద్దరు పురుషులు(గే) లేదా ఇద్దరు మహిళలు పెళ్లిచేసుకోవడం ఇప్పటికీ చట్టబద్దం కాదు. కానీ ఇటీవల కాలంలో క్వీర్ మ్యారేజెస్ సంఖ్య పెరుగుతోంది. గతంలో అలాంటి వాళ్లు పెళ్లి చేసుకున్నా, కలిసి ఉన్నా ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు కానీ ప్రస్తుతం మాత్రం అందరికీ తెలిసేలా ఘనంగా వివాహం చేసుకుంటున్నారు. సాధారణ పెళ్లిల్లానే ప్రీవెడ్డింగ్ షూట్, హల్దీ, సంగీత్, రిసెప్షన్ సైతం విలాసవంతంగా నిర్వహిస్తున్నారు. సమాజంలో స్వలింగ సంపర్కానికి ఆమోదం రావడంతో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుండగా.. అన్ని ఆచారాలను అనుసరిస్తూ పెళ్లి చేసుకున్న కోల్‌కతాకు చెందిన స్వలింగ సంపర్కుల మ్యారేజ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఫ్యాషన్ డిజైనర్ అభిషేక్ రే తన భాగస్వామి చైతన్య శర్మను తొలిసారి ఫేస్‌బుక్‌లో కలుసుకున్నాడు. ఇద్దరి మధ్య సాధారణంగా చాటింగ్ ప్రారంభం కాగా అనేక వీడియో కాల్స్ తర్వాత, అభిషేక్ చైతన్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కోల్‌కతాకు రెండు రోజుల ట్రిప్ ప్లాన్ చేయగా, అదికాస్త రెండు వారాల వెకేషన్‌తో ముగిసింది. ఆ తర్వాత రే ఢిల్లీకి వెళ్లి చైతన్యను కలిసి అక్కడి నుంచి ఇద్దరూ ఆగ్రా(గత ఏడాది మార్చి 22)కు వెళ్లగా తాజ్ ముందు శర్మ ప్రపోజ్ చేయడంతో రే కూడా ఓకే చెప్పాడు. ఆ ప్రపోజల్ పిక్‌నే వారి పెళ్లి కార్డులో ఉపయోగించడం విశేషం.
కోల్‌కతాలో వివాహం :
అభిషేక్, చైతన్యలు హిందూ సంప్రదాయాలను అనుసరించి కోల్‌కతాలో ఒక్కటయ్యారు. పూజారి మంత్రాల నుంచి పవిత్ర అగ్ని చుట్టు ఏడడుగులు వేయడం వరకు అన్నీ పాటించారు. ఘనంగా జరిగిన ఈ వివాహానికి ఇరువురి బంధుమిత్రులు హాజరయ్యారు. పురుషులు ఇద్దరూ వేర్వేరు వర్గాల(ఒకరు బెంగాలీ, మరొకరు మార్వాడీ)కు చెందినవారు కావడంతో రెండు వర్గాల ఆచారాలతో పెళ్లి జరగడం విశేషం. ఇక మ్యారేజ్‌లో ఏర్పాటుచేసిన 'వీ డూ' (we do) అనే సైన్‌బోర్డ్ అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదని, నమోదు చేయడం సాధ్యం కాదని రే, శర్మలకు బాగా తెలుసు.. కానీ అది 'నేరం'గా జాబితా చేయబడదు. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. మా స్నేహితులు, కుటుంబ సభ్యులకు గుర్తుండిపోయే విధంగా చేయమని చైతన్యకు చెప్పానని అభిషేక్ పేర్కొన్నాడు.