'సీతారామం'లో మేజర్ సెల్వన్‌గా గౌతమ్ మీనన్

by S Gopi |   ( Updated:2022-08-25 13:16:09.0  )
సీతారామంలో మేజర్ సెల్వన్‌గా గౌతమ్ మీనన్
X

దిశ, సినిమా : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'సీతారామం' సినిమా కోసం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలైన.. అఫ్రాన్ రోల్‌లో రష్మిక మందన్న, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకుల అంచనాలను భారీ స్థాయిలో పెంచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో కీ రోల్‌‌ మేజర్ సెల్వన్‌ పాత్రలో నటుడు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story