రోడ్ టాక్స్ వసూలు చేసిన గజరాజులు..!!

by Harish |   ( Updated:2022-08-29 15:46:38.0  )
రోడ్ టాక్స్ వసూలు చేసిన గజరాజులు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: అటవీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై ఏనుగులు తిరుగుతుంటాయి. సాధారణంగా గజరాజుల గుంపు నడుచుకుంటూ వెళ్లడం ఆ రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడం చూస్తుంటాం. లారీలు, ఇతర వాహనాలు రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా అక్రమ రవాణా కూడా జోరుగా జరుగుతుంటుంది. కానీ, ఏనుగులు రోడ్డు ట్యాక్స్ వసూలు చేయడం మీరు ఇప్పటి వరకు చూసుండరు. ప్రస్తుతం ఏనుగులు రోడ్ ట్యాక్స్ వసూలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి కేశవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఓ చెరుకు లారీని గమనించిన తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆ లారీని ఆపాయి. లారీని ముందుకు కదలనీయకుండా చేయడంతో డ్రైవర్ చెరుకు లోడ్ పైకి ఎక్కి చెరుకు కట్టలను ఏనుగుల కోసం వేశాడు. ఆ చెరుకు కట్టలను తొండంతో పట్టుకుని అడివిలోకి వెళ్లి, ఆ లారీని ఏనుగులు వదిలివేస్తాయి. ఈ వీడియో చూసిన వారు రోడ్డ్ టాక్స్ కట్టకుండా అక్రమంగా తరలిస్తున్న చెరుకు లోడ్‌కు అడవిలోకి కొత్త ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చారు అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed