విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Javid Pasha |
విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, అంబర్ పేట్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి, బీటెక్ రెండవ సంవత్సరం చదువుతూనే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఇన్ గూగుల్ కొలాబరేషన్ ఏక్సా ట్రైనింగ్ ఎంపిక అయ్యింది. అలబామాలో ట్రైనింగ్ పూర్తి చేసుకునే సమయంలోనే నాసాకు ఎంపిక కావడం సంతోష దాయకమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నగర కార్యాలయంలో జాహ్నవిని ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నాసాకు ఎంపికైన సందర్భంగా ఆమె పైలెటింగ్ కోర్సు శిక్షణ కోసం అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా.ఎన్. గౌతమ్‌ రావు కె.శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, కడలి పురుషోత్తం, సిహెచ్ శ్రీనివాస్, హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed