- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్య్ర పోరాటం మళ్లీ మొదలవుతోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ప్రధాని
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. దాని ప్రభావంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం పాక్ ప్రధానిగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యాడు. అయితే ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే దేశ పార్లమెంట్‌లో తనకు వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓడిన తర్వాత ఆదివారం ఇమ్రాన్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ 1947లో స్వతంత్ర దేశంగా వెలిసింది. కానీ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాల్సిన రోజు వచ్చింది. దేశంలో మళ్లీ విదేశ కుట్రలు తలెత్తాయి' అని ఇమ్రాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపుడుకునేది దేశ ప్రజలు మాత్రమే అని ఇమ్రాన్ అన్నారు.
Pakistan became an independent state in 1947; but the freedom struggle begins again today against a foreign conspiracy of regime change. It is always the people of the country who defend their sovereignty & democracy.
— Imran Khan (@ImranKhanPTI) April 10, 2022